Awareness | యాంటీ డ్రంక్ అండ్ డ్రైవ్ పై అవగాహన

Awareness | కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలంలోని ఉప్లూర్ రోడ్డులోని వరద కాలువ వద్ద ఈ రోజు పోలీస్ సిబ్బందితో కలిసి ప్రజలకు యాంటీ డ్రంక్ అండ్ డ్రైవ్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎస్ఐ జీ. అనిల్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఎస్ఐ అనిల్ రెడ్డి మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, దీని వల్ల అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.
డ్రంక్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలు, చట్టపరమైన చర్యలు, జరిమానాలు, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి విషయాలను ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించిన తరువాత వాహనం నడపకూడదని, తమ కుటుంబ సభ్యుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, వాహనదారులు, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.
