Awards | యోగా గురువు ఉమారాణికి అవార్డు..

Awards | యోగా గురువు ఉమారాణికి అవార్డు..
Awards | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ప్రసిద్ధ యోగ గురువు బోయ ఉమారాణికి మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్(Magic Book of Records) సంస్థ గౌరవ డాక్టరేట్‌తో పాటు డైనమిక్ యోగా ఆర్ట్ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డులను ఈ డిసెంబర్ 13 న డిల్లి(Delhi)లోని ఫరీదాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో అందజేశారు.
గత 25 సంవత్సరాలుగా యోగ శిక్షణలో అంకితభావంతో పనిచేస్తూ అనేక మందిని ఆరోగ్యపరంగా ఉత్తమ స్థితికి చేర్చిన ఉమారాణి కృషిని గుర్తించి ఈ పురస్కారాలు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ యోగ ప్రచార సమితి రాష్ట్ర కమిటీ(State Committee) నిరంతర ప్రోత్సాహం కూడా ఆమె సేవలకు బలమైందని పేర్కొన్నారు.

ఈ అవార్డు ప్రదాన కార్యక్రమంలో మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్ చైర్మన్ సీపీ యాదవ్‌తో పాటు రాజేంద్ర శైని, రామ అవతార్ శర్మ, హరి ఓం శర్మ, ఆర్పీ హ్యాండ్, నిరంజన్ బీసీ పాల్గొన్నారు. అవార్డుల(Awards) అనంతరం ఉమారాణి వద్ద శిక్షణ పొందిన సాధకులు, అభిమానులు ఆమెను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఉమారాణి మాట్లాడుతూ.. ఈ గౌరవం తనకే కాకుండా తన వద్ద శిక్షణ పొందిన సాధకులు, అభిమానులు, తెలంగాణ యోగ ప్రచార సమితి సహకార ఫలితమని అన్నారు. ముఖ్యంగా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ అందించిన ప్రోత్సాహం తన ప్రయాణానికి దోహదపడిందని పేర్కొన్నారు.
ముందు కూడా యోగ సాధకులను తయారు చేస్తూ, మరింత మందికి యోగ ప్రయోజనాలు అందించేలా కృషి చేస్తానని ఉమారాణి తెలిపారు. ఈ విజయం తనకన్నా సాధకులదేనని, అలాగే తెలంగాణ యోగ ప్రచార సమితి సహకారంతోనే సాధ్యమైందని ఆమె స్పష్టం చేశారు.
