వెలగపూడి – ఏపీలోని 5 నగరాలు ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ అవార్డులకు ఎంపికయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ ఏడాది ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ అవార్డులను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి నగరాలు పరిశుభ్రత విషయంలో ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు ఈ అవార్డులకు ఎంపికయ్యాయి. ఇందులో విశాఖ నగరానికి’ స్పెషల్ కేటగిరీ మినిస్టీరియల్’ అవార్డు దక్కగా . విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలు ‘స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీస్’ కేటగిరీలో ఎంపికయ్యాయి. రాజమండ్రి నగరం రాష్ట్రస్థాయి మినిస్టీరియల్ అవార్డుకు ఎంపికైంది.
స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా నిర్వహించే ఈ సర్వేలో పట్టణాల్లోని పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, పౌరుల సహకారం, స్థిరమైన పరిష్కారాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. విశాఖపట్నం రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నగరాల పౌరులను, స్థానిక సంస్థలను అభినందించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రాష్ట్రంలో పరిశుభ్రతపై అవగాహనను మరింత పెంచేందుకు దోహదపడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.