పెద్దపల్లి, ఆంధ్రప్రభ : ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి ఏసీపీ (Peddapalli ACP) గజ్జి కృష్ణకు బెస్ట్ మోటివేటర్ అవార్డును తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అందజేశారు. శనివారం హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణకు అవార్డు అందించారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదాతలను ప్రోత్సహించారని జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ నివేదిక అందించి సిఫారసు చేయడంతో ఏసీపీ కృష్ణ ను బెస్ట్ మోటివేటర్ అవార్డు (Best Motivator Award) కు ఎంపిక చేశారు. రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న పెద్దపల్లి ఏసీపీ గజ్జికృష్ణను పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.