అమాత్యునికి అవార్డు

- సీఎం చేతుల మీదుగా అందుకున్న మంత్రి స్వామి
టంగుటూరు (ఆంధ్రప్రభ ) : ప్రకాశం జిల్లా మంత్రి స్వామికి ఉత్తమ అవార్డు లభించింది. తుఫాను సమయంలో జిల్లాలో నిత్యం అధికారుల అప్రమత్తం చేసి నష్ట నివారణ చర్యలు చేపట్టినందుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తమ అవార్డును ఉండవల్లిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ ఉత్తమ ప్రజాప్రతినిధిగా మంత్రిగా అవార్డు రావడంతో బాధ్యత మరింత పెరిగింది అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ సూచనలతో సమర్థవంతంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సహకారంతో తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. జిల్లాలో ఎక్కడ ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నాం. వరద బాధితులకు సకాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నష్టపరిహారం అందజేశామని తెలిపారు.
