Avanigadda | సమస్యల ప‌రిష్కారానికి ప్రజాదర్బార్

Avanigadda | సమస్యల ప‌రిష్కారానికి ప్రజాదర్బార్

Avanigadda | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజాదర్బార్ వేదికగా నిలుస్తుందన్నారు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా. పార్టీ ముఖ్య నాయకులు ప్రజలతో స్వయంగా మాట్లాడి వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీపై సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ ప్రజా దర్బార్‌లో ఇళ్లు, ఇళ్లస్థలాల కోసం, వితంతు పెన్షన్లు, వృద్దాప్య పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్ల కోసం అర్జీలు వచ్చాయి. ప్రతిపక్షంలో ప్రజా సమస్యలపై పోరాటం చేసిన తాము.. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు బండే శ్రీనివాసరావు, రావి నాగేశ్వరావు, పర్చూరి దుర్గాప్రసాద్, బండే కనకదుర్గ, పాటిబండ్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply