అప్ర‌మ‌త్తత అవ‌స‌రం

ఆన్‌లైన్ మోసాల‌పై క‌ర్నూలు ఎస్పీ సూచ‌న‌లు

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఆన్‌లైన్ మోసాల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్(SP Vikrant Patil) సూచించారు. నకిలీ పెట్టుబడి కంపెనీలు, సోషల్ మీడియా(Social Media), టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులు ద్వారా అత్యధిక లాభాలు లేదా గ్యారంటీ ప్రాఫిట్లు ఇస్తామని చెప్పి బాధితులను ఆకర్షిస్తున్నారని వాటిని న‌మ్మ‌కూడ‌ద‌ని సూచించారు.

నకిలీ వెబ్సైట్లు, ట్రేడింగ్, యాప్లు వాడి నకిలీ లాభాలు చూపిస్తూ మరిన్ని పెట్టుబడులు పెట్టమని ప్రలోభపెడతారని మోస‌పోవ‌ద్ద‌ని హెచ్చ‌రించారు. ప్రజలను తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని ప్రచారం చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కొందరు నమ్మకం కల్పించినట్టు, షేర్లు, బంగారం, ఆన్‌లైన్ ట్రేడింగ్(Online Trading) తదితర పేర్లతో నకిలీ వెబ్‌సైట్లు, యాప్స్ ద్వారా మోసం చేస్తున్నార‌ని తెలిపారు. ఇటీవల సందర్భాల్లో కర్నూలు NR పేటకు చెందిన వ్యక్తి ఇలా ఇన్వెస్ట్‌మెంట్ లింక్ లతో మోసపోయారు.

ట్రేడింగ్ ప్లాట్ఫారమ్లు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు(Investment Advisors) నిజమైనవో కాదో తెలుసుకోండి. SEBI వద్ద రిజిస్ట్రేషన్, లైసెన్స్ ఉన్నాయో లేదో చూసుకోవాల‌ని సూచించారు. సోషల్ మీడియా ద్వారా వచ్చిన లింకులు లేదా ఆఫర్లను నమ్మోద్ద‌ని, అధిక లాభాల వాగ్దానాలను అనుమానించాల‌ని చెప్పారు. వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలు పంచుకోవద్ద‌ని తెలిపారు. మోసగాళ్లు పన్నులు లేదా ఫీజుల పేర్లతో డబ్బు వసూలు చేస్తారు. అనుమానం ఉంటే ఫిర్యాదు చేయాల‌ని మీ సమాచారం గోప్యంగా ఉంటుంద‌ని తెలిపారు.

బాధితులు భయపడకుండా పోలీసులను సంప్రదించాలన్నారు. మీ డబ్బు మీ భద్రత, పెట్టుబడి చేసే ముందు పూర్తిగా ఆలోచించండి. మోసపోయిన ఇతరులకు కూడా 1930 టోల్ ఫ్రీ(1930 Toll Free) నంబర్ సమాచారాన్ని చేరవేయాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply