Aussie Entry గల్ఫ్ లో పెద్దన్న మాయం Andhra prabha Analysis

Aussie Entry గల్ఫ్ లో పెద్దన్న మాయం Andhra prabha Analysis
- బెర్త్ ఖాళీ.. పోటీలో పెద్దన్నలు
- గ్లోబల్ పోలీస్ గోబ్యాక్
- చిక్కుల్లో అమెరికా
- తెరమీదకు పాశ్చ్యత కూటమి
- ఇరాన్ ఎలయన్స్ అలెర్ట్
- అమెరికాపై గల్ఫ్ దేశాల్లో అసంతృప్తి
- పెట్టుబడుల ఉపసంహరణకు సన్నద్ధం
- ఆర్థిక సాయంతో చైనా సిద్ధం
- రష్యా ఆయుధాల ఆఫర్
- శాంతి వచనాలతో భారత్ ఆకర్షణ
( ఆంధ్రప్రభ, ఎనాలిసిస్ )

వెనిజులపై సైనిక చర్యతో… ప్రపంచ దేశాల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్న అమెరికా.. తాజాగా ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ పై చేపట్టిన ఆరేషన్ ఎథిక్ ఫ్యూరీ కాస్త… పశ్చిమాసియాలో లోకల్ ఫైట్ కు ఆజ్యం పోసింది. ఇప్పటి వరకూ తమకు కష్టం వస్తే .. ఆదుకునే ఆత్మబంధువు అమెరికా మాత్రమేనని నమ్మిన మిత్ర దేశాలకు.. అగ్రరాజ్యం చిటికిన వేలు చూపింది. ఇంతకాలం అమెరికా సైనిక స్థావరాలకు ఆతిథ్యం ఇచ్చిన ఈ దేశాలపై.. ఇరాన్ ముప్పేట దాడి తీవ్రతరం కాగా..

గల్ఫ్ దేశాల్లోని చమురు కేంద్రాలు, అమెరికా స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ క్షిపణులను కుమ్మరిస్తుంటే.. అండగా నిలవాల్సిన అమెరికా ముఖం చాటేసింది. ఈ తరుణంలో ప్రత్యామ్నాయ రక్షక దేశం కోసం గల్ఫ్ దేశాలు అన్వేషణ ప్రారంభించాయి. ఫలితంగా .. ఆస్ట్రేలియా తెరమీదకు వచ్చింది.
గల్ఫ్ దేశాలకు మరీ ముఖ్యంగా యునైటెడ్ అరబ్స్ ఎమిరేట్స్ కు ఆయుధాలు సైనిక సాయం చేసేందుకు ఆసీస్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాలను కీలక మలుపు తిప్పుతోంది.
Aussie Entry : ఆసీస్ ఎంట్రీ.. ఇలా..

ఆస్ట్రేలియా నిర్ణయాన్ని అమెరికా స్వాగతించింది. అమెరికా ప్రయత్నాలకు ఆస్ట్రలియా అదనపు బలంగా మారుతోంది. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ముప్పును ఎదుర్కోవడానికి ఇప్పటి వరకు అమెరికా, ఇజ్రాయెల్ మాత్రమే ప్రధానంగా పోరాడుతున్నాయి. ఆస్ట్రేలియా కూడా జతకలవటంతో అమెరికాపై సైనిక భారం కొంత తగ్గుతుంది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ AUKUS ఒప్పందంతో ఇప్పటికే రక్షణ రంగంలో కలిసి పనిచేస్తున్నాయి. ప్రస్తుతం గల్ఫ్ దేశాలకు ఆస్ట్రేలియా రక్షణ కవచంలా మారటంతో అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగానే ఉంది. యూఏఈ అభ్యర్థన మేరకు ఆస్ట్రేలియా అధునాతన మధ్యశ్రేణి గగనతల క్షిపణులను (Advanced Medium-Range Air-to-Air Missiles – AMRAAMs) సరఫరా చేయనుంది.

ఇవి డ్రోన్లను , ఇతర గగనతల ముప్పులను సమర్థవంతంగా అడ్డుకుంటాయి. E-7A వెడ్జ్ టైల్ (Wedgetail) నిఘా విమానాన్ని గల్ఫ్ ప్రాంతానికి పంపుతోంది. దీన్ని ‘ఫ్లయింగ్ రాడార్’ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది దాదాపు 4 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని గగనతలాన్ని పర్యవేక్షించగలదు. ఇది ఇరాన్ ప్రయోగించే క్షిపణులు, డ్రోన్లను చాలా ముందుగానే గుర్తించి, హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ విమాన కార్యకలాపాలను నిర్వహించడానికి ఆస్ట్రేలియన్ డిఫెన్స్ ఫోర్స్ (ADF) కు చెందిన 85 మంది నిపుణులను మోహరిస్తున్నారు. ప్రాథమికంగా ఈ విమాన నిఘా మిషన్ నాలుగు వారాల పాటు కొనసాగుతుంది. ఈ సహాయం పూర్తిగా రక్షణాత్మకం అని ప్రధాని ఆంథోనీ అల్బనీస్ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా నేరుగా ఇరాన్‌తో యుద్ధంలో పాల్గొనదు అక్కడ భూతల దళాలను (Ground Troops) మోహరించదు.

గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుతం సుమారు 1,15,000 మంది ఆస్ట్రేలియన్లు ఉన్నారు. (వీరిలో 24,000 మంది యూఏఈలోనే ఉన్నారు). తమ పౌరుల రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నారు.

అక్టోబర్ 1, 2025 నుండి అమలులోకి వచ్చిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) తర్వాత ఆస్ట్రేలియా, యూఏఈ మధ్య రక్షణ సంబంధాలు మరింత బలపడ్డాయి. గల్ఫ్ దేశాలకు (ముఖ్యంగా యూఏఈకి) ఆస్ట్రేలియా అందిస్తున్న ఈ సైనిక సహాయం మధ్యప్రాచ్యంలో కొత్త రాజకీయ సమీకరణాలకు నాంది పలుకుతోంది.
Aussie Entry : గల్ఫ్ బ్రిడ్జింగ్ ప్లాన్

గల్ఫ్ దేశాలు ఇప్పుడు ఒకవైపు అమెరికా- ఆస్ట్రేలియా కూటమిని, మరోవైపు చైనా-రష్యా కూటమిని బేరీజు వేసుకుంటున్నాయి. ఏ ఒక్కరి వైపు పూర్తిగా మొగ్గకుండా, అందరి నుంచి ప్రయోజనం పొందాలనే “బ్రిడ్జింగ్” (Bridging) వ్యూహాన్ని అవి అనుసరిస్తున్నాయి. ఆస్ట్రేలియా సహాయం ఒక వైపు ఉంటే, దానికి పోటీగా చైనా/రష్యా , అధునాతన ఆయుధాలను ఈ ప్రాంతానికి చేరవేసే ప్రమాదం ఉంది, ఇది మధ్యప్రాచ్యంలో ఆయుధ పోటీకి దారితీయవచ్చు. అమెరికా గుప్పెట్లో నుంచి పూర్తిగా గల్ఫ్ దేశాలు బయటపడటం కంటే, తమ రక్షణ కోసం బహుళ మిత్రదేశాల (Multiple Allies) మద్దతును కూడగట్టుకోవడంగా చూడవచ్చు. ఆస్ట్రేలియా రాకతో మధ్యప్రాచ్యంలో పాశ్చాత్య దేశాల కూటమి మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది.
Aussie Entry : గ్లోబల్ పోలీస్ .. సెల్ఫ్ గోల్

అమెరికాలో ఆర్థిక సంక్షోభం, రాజకీయ విభజనలు, విదేశీ యుద్ధాల్లో పాల్గొనడం పట్ల అక్కడి ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో అమెరికా తన దృష్టిని సొంత దేశం వైపు మళ్లించుకుంటోంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి హఠాత్తుగా వెనక్కి తగ్గడం, ఉక్రెయిన్ , పశ్చిమాసియా (Middle East) సంక్షోభాల్లో నేరుగా రంగంలోకి దిగకుండా కేవలం ఆయుధాలు, ఆర్థిక సాయానికే పరిమితం కావడంతో మిత్రదేశాల్లో అమెరికా రక్షణపై అనుమానాలు తప్పలేదు.
Aussie Entry : చిక్కుల్లో అమెరికా
ఇప్పటి వరకూ అమెరికాపైనే ఆధారపడిన గల్ఫ్ దేశాలు.. తాజాగా ఆస్ట్రేలియా వైపు మొగ్గు చూపటం వెనుక బలమైన రాజకీయాంశాలు ఉన్నాయి. గల్ఫ్ దేశాలు తమ రక్షణ అవసరాల కోసం కేవలం ఒక్క దేశం (అమెరికా) పైనే ఆధారపడకుండా, తమ భాగస్వామ్యాలను వైవిధ్యపరుచుకోవాలని (Diversify) భావిస్తున్నాయి. అమెరికా కొన్నిసార్లు మధ్యప్రాచ్య రాజకీయాల నుండి తప్పుకోవాలని చూడటం లేదా కఠినమైన షరతులు విధించటంతో గల్ఫ్ దేశాలు ఆస్ట్రేలియా మాదిరి నమ్మక ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నాయి.
ఇరాన్ నుంచి డ్రోన్ , క్షిపణి దాడుల నుంచి తక్షణ రక్షణ కోసం యూఏఈ స్వయంగా ఆస్ట్రేలియాను సహాయం కోరింది. అమెరికా విధానాల పట్ల అసంతృప్తితో సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు అమెరికాలోని తమ భారీ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని కూడా ఆలోచిస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి, ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతుంది.
Aussie Entry : పెద్దన్న రేస్ లో… త్రిమూర్తులు
తాజాగా ప్రపంచ రాజకీయాల్లో ఒక భారీ మార్పు కనిపిస్తోంది. దశాబ్దాలుగా “గ్లోబల్ పోలీస్ష పాత్రను పోషించిన అమెరికా పట్టు క్రమంగా తగ్గుతోంది. ఇది ముమ్మాటికీ వాస్తవం. పెద్దన్న పీఠం నుంచి అమెరికా వైదొలిగితే.. ఆ స్థానాన్ని భర్తీకి కొన్ని అగ్ర రాజ్యాలు పోటీ పడుతున్న స్థితి ఇది. ఆస్ట్రేలియా తదితర పాశ్చాత్య దేశాలు గల్ఫ్ దేశాలకు రక్షణ సహకారాన్ని పెంచడంతో చైనా, రష్యా తమదైన వ్యూహాలతో స్పందిస్తున్నాయి. 2026 నాటి తాజా అంతర్జాతీయ పరిణామాల ప్రకారం, ఈ రెండు దేశాలు గల్ఫ్ ప్రాంతంలో తమ ప్రభావాన్ని పెంచుతున్నాయి.
Aussie Entry : చైనా రెడీ

ఆర్థికంగా దౌత్యపరంగా చైనా ఇప్పుడు అమెరికాకు అతిపెద్ద సవాలు. ‘బెల్ట్ అండ్ రోడ్’ ప్రాజెక్టులతో ఆఫ్రికా, ఆసియా దేశాలను తన దారిలోకి తెచ్చుకుంటోంది. గల్ఫ్ దేశాల మధ్య (సౌదీ-ఇరాన్) రాజీ కుదర్చడం ద్వారా తాను కూడా ప్రపంచ శాంతిని స్థాపించగలనని నిరూపిస్తోంది. చైనా కేవలం సైనిక శక్తి కంటే ఆర్థిక బలం, శాంతి చర్చలతో తన పట్టును బిగిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా ఆయుధాలపై కఠిన షరతులు విధించినప్పుడు, చైనా తన అధునాతన డ్రోన్లు, క్షిపణి సాంకేతికతను ఎటువంటి రాజకీయ షరతులు లేకుండా గల్ఫ్ దేశాలకు ఆఫర్ చేస్తోంది. 2023లో సౌదీ-ఇరాన్ మధ్య కుదిర్చిన ఒప్పందం తరహాలోనే, 2026 మార్చిలో కూడా ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య చైనా ఒక “శాంతి దూత”గా కనిపించడానికి ప్రయత్నిస్తోంది. తద్వారా ఈ ప్రాంతంలో అమెరికా కంటే తానే మెరుగైన శాంతి కాముకుడినని చాటి చెప్పాలని చైనా ఎదురు చూస్తోంది. ‘ఇన్వెస్ట్‌కార్ప్’ వంటి సంస్థలతో గల్ఫ్ దేశాల సార్వభౌమ నిధులను (Sovereign Wealth Funds) చైనా ఆకర్షిస్తోంది.
Aussie Entry : రష్యా సైతం

సైనిక ఇంధన వనరుల పరంగా రష్యా తన ఉనికిని చాటుతోంది. ముఖ్యంగా పశ్చిమాసియాలో సిరియా, ఇరాన్ వంటి దేశాలతో పటిష్టమైన సంబంధాలు కలిగి ఉండి, అమెరికా వ్యతిరేక వర్గానికి నాయకత్వం వహిస్తోంది. రష్యా తన పాత మిత్రదేశాలతో అనుబందాన్ని కొనసాగిస్తూనే, రక్షణ రంగంలో కొత్త ద్వారాలను వెతుక్కుంటోంది. రష్యా, చైనా, ఇరాన్ కలిసి గల్ఫ్ ఆఫ్ ఓమన్‌లో ప్రతి ఏటా ‘సెక్యూరిటీ బెల్ట్’ (Security Belt) పేరిట నావికాదళ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. గల్ఫ్ దేశాలకు ఆస్ట్రేలియా మద్దతు పెరిగే కొద్దీ, ఈ త్రైపాక్షిక కూటమి మరింత బలోపేతం కావటం తథ్యం. సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలకు తమ అధునాతన S-400 క్షిపణి నిరోధక వ్యవస్థలను విక్రయించడానికి రష్యా చర్చలు జరుపుతోంది. ఇది పాశ్చాత్య దేశాల ఆయుధాల నుంచి దూరం చేయటమే రష్యా ఎత్తుగడ. చమురు ఉత్పత్తిలో సౌదీ అరేబియాతో కలిసి రష్యా పనిచేయడం ద్వారా గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తన ప్రభావాన్ని నిలబెట్టుకుంటోంది.
Aussie Entry : గ్లోబల్ లీడర్ పాత్రలో భారత్

భారత దేశం ఏ కూటమిలోనూ చేరకుండా, వర్దమాన దేశాల (Global South) వాణిని వినిపిస్తూ ఒక సంతులన శక్తిగా (Balancing Power) ఎదుగుతోంది. వివాదాలను యుద్ధంతో కాకుండా చర్చలతో పరిష్కరించుకోవాలనే భారత విధానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం రాకుండా ఆస్ట్రేలియా నిఘా వ్యవస్థలు (Wedgetail) అడ్డుకుంటే, అది భారత ఇంధన భద్రతకు మంచిది. చమురు సరఫరాకు ఆటంకం కలగదు. గల్ఫ్ దేశాల్లోని లక్షలాది మంది భారతీయ వలసదారుల రక్షణకు ఈ అదనపు భద్రతా చర్యలు పరోక్షంగా తోడ్పడతాయి. భారత్‌కు ఆస్ట్రేలియా (QUAD భాగస్వామి) ఇరాన్ (చాబహార్ పోర్ట్ భాగస్వామి) రెండూ ముఖ్యమే. ఈ రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరిగితే, భారత్ ఎవరి వైపు ఉండాలనేది పెద్ద దౌత్య సవాలుగా మారుతుంది.
ఒకవేళ ఈ రక్షణ ఒప్పందం వల్ల పాకిస్తాన్ కూడా చైనా/రష్యా వైపు మరింతగా మొగ్గు చూపితే, భారత సరిహద్దుల్లో కొత్త భద్రతా సమస్యలు తలెత్తవచ్చు.
ALSO READ : US Weapons Israel : గల్ఫ్ లో పేలుళ్లు Andhra Prabha Analysis
