దళిత మహిళా సర్పంచ్ పై దాడి యత్నం..

దళిత మహిళా సర్పంచ్ పై దాడి యత్నం..

కుంటాల, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని మేదన్ పూర్ గ్రామంలో జరిగిన గ్రామసభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామసభ ప్రారంభం కాగానే కొందరు సభా వేదికపై వద్దకు వచ్చి గ్రామసభలో వాగ్వాదానికి దిగారు. దీంతో సభ వేదికపై గొడవకు దిగడంతో వేదికపై ఉన్న స్థానిక సర్పంచ్ కార్యం పద్మను బూతులు తిడుతూ బెదిరించారు. దీంతో సర్పంచ్ కుంటాల పోలీస్ స్టేషన్లోని ఫిర్యాదు చేశారు. అదే విధంగా తనను కొందరు వ్యక్తులు కులం పేరుతో బెదిరించి దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

దీంతో ఇప్పటి వరకు ఆమె పై మూడుసార్లు కొందరు వ్యక్తులు బూతులు తిడుతూ అవమానపరిచారని అదేవి ధంగా పంచాయతీ కార్యదర్శి పై సైతం ఫిర్యాదు చేశారని కావాలని కక్షపూరితంగా నాపై కక్ష కట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సభ వేదిక ముందే గ్రామసభ నుండి బయటకు వస్తే.. నిన్ను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేసి పూర్తి వివరాలు సేకరిస్తామని పేర్కొన్నట్టు అని తెలిపారు.

Leave a Reply