ఇనుప రాడ్డుతో దాడి..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : మానవ సంబంధాలు క్రమంగా దారుణ రూపం దాల్చుతున్నాయి. దానికి నిదర్శనంగా నిలిచే ఘోర ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల మండలం గణపురంలో మరిది చేతిలో వదిన హత్యకు గురైంది.

పోలీసుల సమాచారం ప్రకారం, గణపురానికి చెందిన సుగాలి నాగమ్మ అనే మహిళ తన మరిది లోకన్న నాయక్ చేతిలోనే ప్రాణాలు కోల్పోయింది. అదే గ్రామంలో అన్నదమ్ములు కుటుంబాలతో నివసిస్తున్నారు. వదిన నాగమ్మ ప్రవర్తన సరిగా లేదని భావించిన లోకన్న నాయక్ తరచూ మందలించేవాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కోపం ఆపుకోలేక లోకన్న నాయక్ పక్కనే ఉన్న ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో నాగమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply