తుక్కాపురం గ్రామంలో దారుణం..

తుక్కాపురం గ్రామంలో దారుణం..

యాదాద్రి భువనగిరి జిల్లా, ఆంధ్రప్రభ : కన్న కూతురు బెజ్జంగి కీర్తన రెడ్డిని (14) తన్నతల్లి రత్నకళ గొంతు కోసి హత్య చేసింది. కొడుకు బెజ్జంగి అంశాంత్ రెడ్డిని కూడా కత్తితో గొంతు కోయడానికి ప్రయత్నంచింది. అయితే.. కొడుకు బెజ్జంగి అంశాంత్ రెడ్డి కేకలు వేయడంతో గ్రామస్థులు అక్కడకు చేరుకున్నారు. దీంతో కొడుకు తప్పించుకున్నాడు.

అనంతరం ఆమె ఉరి వేసుకోవడానికి యత్నించింది. శనివారం రాత్రి అత్తారిల్లు బీబీనగర్ మండలం జైనపల్లి నుండి తుక్కాపురం అమ్మవారి ఇంటికి వచ్చిన మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి భార్య రత్నకళ నిందితురాలు. అయితే.. నిందితురాలైన రత్నకళ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ కి తరలించారు. ఆమె జైనపల్లి మాజీ సర్పంచ్ బెజ్జంగి నరేందర్ రెడ్డి భార్యగా సమాచారం.

Leave a Reply