Atmospheric | వాతావరణ పర్యవేక్షణకు ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలు

Atmospheric | వాతావరణ పర్యవేక్షణకు ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలు

  • జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

Atmospheric | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఖచ్చితమైన, రియల్ టైమ్ వాతావరణ పర్యవేక్షణ కోసం ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలు నిరంతర డేటాను అందిస్తాయని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. మంగళవారం ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలోని ఏపీ ట్రాన్స్ కో కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాన్ని (AWS) కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలు ఆర్టీజిఎస్ కు అనుసంధానం అయ్యాయన్నారు.

ఈ కేంద్రం ద్వారా వర్షపాతం, నేలలో తేమ, వాతావరణ పీడనం, గాలి, ఉష్ణోగ్రత వంటి వివరాలు ఆటోమేటిక్ గా ఆన్లైన్ లో నమోదు అవుతాయని తెలిపారు. తుఫాను లాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ముందస్తు హెచ్చరికలు జారీ చేయడానికి, వ్యవసాయ ప్రణాళికలు రూపొందించడానికి సంబంధిత వాతావరణ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

Atmospheric |

ఈ కేంద్రానికి సంబంధించిన యంత్రాల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని, ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సీపీఓ భారతి, డివైఎస్ఓ భాస్కర్, రామాంజనేయులు, ఏ ఎస్ ఓ సరళ కుమారి, తదితరులు పాల్గొన్నారు.

Atmospheric |

Leave a Reply