Atchannaidu | ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం..

Atchannaidu | ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం..
Atchannaidu, శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : అరసవిల్లి లో రథసప్తమి రోజున స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆదివారం రాత్రి అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రకటించిందన్నారు. సూర్య నమస్కారాలతో ప్రారంభించి శోభయాత్ర అద్భుతంగా జరిగిందన్నారు. సూర్య నమస్కారాలు వేల మందితో ప్రారంభించినట్లు వివరించారు. శోభయాత్ర అద్భుతంగా జరిగిందని తెలిపారు. గత కొన్ని రోజులుగా జిల్లా అధికారులు శ్రమకు ఫలితం ఉందన్నారు. రథసప్తమి వేడుకలు విజయవంతంగా నిర్వహించినట్లు చెలిపారు. వారం రోజులపాటు మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
శాసన సభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ.. సామాన్య భక్తులకు భగవంతుని దర్శనం అందించాలనే ఉద్దేశంతో మంచినీరు, మరుగుదొడ్లు, తదితరమైన ఏర్పాట్లు చేయడమైనదన్నారు. రథసప్తమి సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రజలు తిలకించారన్నారు. ఈ సమావేశంలో పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరి వర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
