Atal Bihari Vajpayee | అటల్ జీకి ఘన నివాళి

Atal Bihari Vajpayee | అటల్ జీకి ఘన నివాళి

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్..
ఏపీ సీఎం చంద్రబాబు పుష్సాంజలి


Atal Bihari Vajpayee | (ఆంధ్రప్రభ, వెలగపూడి ప్రతినిధి) : అమరావతి రాజధానిలోని వెంకటపాలెం వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి (Atal Bihari Vajpayee) విగ్రహాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం అటల్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chauhan), ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) మొక్కను నాటారు. సభా ప్రాంగణంలో వాజ్‌పేయి జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.

అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన సుపరిపాలనా దివస్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రులు సత్యకుమార్ యాదవ్, పి.నారాయణ, కందుల దుర్గేష్ పాల్గొన్నారు.

సుపరిపాలన దినోత్సవంలో పాల్గొనేందుకు అమరావతి(Amaravati)కి వచ్చిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ కు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ స్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వచ్చిన శివరాజ్ సింగ్ చౌహాన్‌. మర్యాదపూర్వకంగా సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.

Leave a Reply