Assembly | తులం బంగారం పేరిట మోసం…

Assembly | తులం బంగారం పేరిట మోసం…

Assembly | భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతుందని, అధికారంలోకి వస్తే లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ఆడబిడ్డలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మాజీ మంత్రి బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాల్కొండ నియోజకవర్గానికి చెందిన 429 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కేసీఆర్ ఆలోచన నుండి ఈ స్కీం ప్రారంభం అయ్యిందని అన్నారు. మొదటగా ఎస్సిలకు తరువాత బీసీలకు అనంతరం పేద వర్గంలో ఉన్న అందరికి ఈ పథకం వర్తింప జేయడం జరిగిందని అన్నారు. పథకాన్ని రూ 50 వేయిల నుండి ప్రారంభం చేసి రూ. 100116 మేన మామ కట్నం కింద కేసీఆర్ అందజేశారని తెలిపారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నిక(Assembly election)ల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మి ఓట్లు వేశారని, అధికారం లోకి వచ్చి రెండేండ్లు అవుతుందని, హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలం అయ్యిందని ఎమ్మెల్యే ఆరోపించారు.

రెండేండ్లు అయినా తులం బంగారం హామీ తుంగలో తొక్కారని అన్నారు. తులం బంగారం అమలు గురించి అసెంబ్లీ లో అడిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ తీరును ప్రజలు గమనించాలని కోరారు. సమయం వచ్చినప్పుడు మహిళలు బుద్ది చెప్పాలని కోరారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేడు చెక్కులు అందించిన వారందరికీ రూ. లక్ష తో పాటు తులం బంగారం అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు అసెంబ్లీ వేదికగా పోరాటం చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో నియోజకవర్గం లోని బీఆర్ఎస్ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a Reply