Assembly | ఆ ఆర్డర్ కాపీ చూపిస్తే రాజీనామా చేస్తా…

Assembly | ఆ ఆర్డర్ కాపీ చూపిస్తే రాజీనామా చేస్తా…

లేదంటే భట్టి రాజీమానా చేయాలి…

Assembly | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో రాజీనామా సవాళ్లతో దద్దరిల్లాయి. మహిళా సంఘాల రుణాల విషయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సంచలన సవాల్ విసిరారు.

అసెంబ్లీలో చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మహిళా సంఘాలకు తమ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.57వేల కోట్ల రుణాలను మంజూరు చేసిందని పేర్కొన్నారు. అయితే, ఆ లెక్కలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఒకవేళ మహిళలకు రూ.57వేల కోట్ల రుణాలు ఇచ్చినట్లు ప్రభుత్వం దగ్గర ఉన్న ఆర్డర్ కాపీని ఇప్పుడే సభలో చూపిస్తే.. తాను తన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. ఒకవేళ అటువంటి ఆర్డర్ కాపీ లేకపోతే.. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు భట్టి విక్రమార్క తన డిప్యూటీ సీఎం పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారా.. అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ సవాల్‌తో సభలో ఒక్కసారిగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Leave a Reply