నిర్మల్ లో వైద్యుల రాస్తారోకో

నిర్మల్ లో వైద్యుల రాస్తారోకో
వైద్యుని పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి
నిర్మల్ రూరల్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్ వి ఆర్ చిన్న పిల్లల ఆసుపత్రి వైద్యుని పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వైద్యులు నిర్మల్ సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయం ముందర రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు.. ఈ సందర్భంగా వైద్య సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ. రోజురోజుకు వైద్యులకు భద్రత లేకుండా పోతుందని, వైద్యుని చాంబర్ లోకి చొరబడి డాక్టర్ సంతోష్ రాజు పై దాడి చేయడం హేయమైన చర్య అని వారు పేర్కొన్నారు.
నిందితులను అరెస్టు చేసేంతవరకు తమ ఆందోళన కొనసాగిస్తామని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్ వైద్యుల తోపాటు వివిధ సంఘాలకు చెందిన వారు మద్దతు పలికారు.
