భర్త కిరాతక దాడి

భర్త కిరాతక దాడి
- సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తూ
- ఫ్యామిలీ పైశాచికానందం
- వీడియో వైరల్ తో
- చలించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు
- ఇద్దరు అరెస్ట్ – కుటుంబ సభ్యుల కోసం గాలింపు
ఒంగోలు క్రైం, ఆంధ్రప్రభ : అనుమానపు భర్త కిరాతంగా కొడుతుంటే.. సెల్ ఫోన్(Cell phone)లో చిత్రీకరిస్తూ కుటుంబ సభ్యులు పైశాచికానందం పొందారు. తమ అమానుష కాండను నిరూపించే వీడియోను వైరల్ చేశారు. తాజా ఎస్పీ హర్షవర్థన్ రాజు(SP Harshavardhan Raju) చలించిపోయారు.
తీవ్రంగా స్పందించారు. ఈ సైకోల భరతం పట్టేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగారు. ఇద్దరిని పట్టుకున్నారు. మిగిలిన ఫ్యామిలీ కోసం జల్లెడ పట్డారు. ప్రకాశం జిల్లా తర్లపాడు మండలం కలుజువ్వలపాడు గ్రామం ఎస్టీ కాలనీలో ఘోరం జరిగింది. భర్త బాలాజీ తన భార్య గురునాథం భాగ్యలక్ష్మిపై అమానుషంగా(inhuman) దాడి చేశాడు.
ఈ అమానవీయ ఘటనను బంధువులు వీడియోను చిత్రీకరించి పైశాచిక ఆనందాన్నిపొందారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఘటనపై జిల్లా పోలీసులు తీవ్రంగా స్పందించారు. నూతనంగా ఛార్జ్ తీసుకున్న(took charge) జిల్లా ఎస్పీ నేరుగా రంగంలోకి దిగారు.
జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు దర్శి డీఎస్పీలక్ష్మీనారాయణ(DSP Lakshminarayana), పొదిలి సీఐ వెంకటేశ్వర్లు, తర్లపాడు ఎస్సై బ్రహ్మనాయుడు ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితురాలిని పరామర్శించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు.
మిగతా కుటుంబ సభ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ కార్యాలయం(District SP Office) నుండి బుధవారం విడుదల చేశారు. ఈ ప్రకటన సుమారు 12 ఏళ్ల కిందట బాలాజీ, భాగ్యలక్ష్మివివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భాగ్యలక్ష్మి గ్రామం(Bhagyalakshmi Village)లోని ఒక బేకరీలో పని చేస్తోంది.
బాలాజీకి మద్యం అలవాటు ఉండగా, భార్యను నిత్యం అనుమానిస్తూ వేధింపులకు గురి చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో సెప్టెంబర్ 13న రాత్రి బేకరీలో పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా బాలాజీ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమెను ఇంటికి తీసుకువెళ్లాడు. చేతులు కట్టి బెల్ట్(hands tied belt)తో, కాళ్లతో, చేతులతో దాడి చేశారు.
దాడిని బంధువులు సెల్ ఫోన్ లో వీడియో చిత్రీకరించి పైశాచికానందాన్నిపొందారు. ఈ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కేసు నమోదు చేశారు.
- మహిళలు.. చిన్నారులపై దాడులు సహించం
మహిళలపై, చిన్నారులపై దాడులు చేస్తే సహించబోమని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు(Harshavardhan Raju) హెచ్చరించారు. బాధితులకు న్యాయం చేయడమే కాకుండా, నేరస్థులను కఠినంగా(harshly) శిక్షించనున్నట్టు తెలిపారు. ఎవరన్నా ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని గుర్తుంచుకోవాలన్నారు.
