Asifabad | సేవాభావం ఎంతో పుణ్యం..

Asifabad | సేవాభావం ఎంతో పుణ్యం..
Asifabad | సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : కుమరం భీం ఆసిఫాబాద్ (Asifabad) జిల్లా సిర్పూర్(యు) మండల కేంద్రంలో ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఆడ వెంకటేష్ (Venkatesh) ఆధ్వర్యంలో నిరుపేద వృద్ధులకు ఉచితంగా దుప్పట్లు పంపిణీ (blankets Distribution) ఏర్పాటు చేయగా, ఈ కార్యక్రమానికి జైనూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆత్రం భగవంతరావు, సిర్పూర్(యు) మండల తహశీల్దార్ రాథోడ్ ప్రహ్లాద్ లు 75మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… చలి తీవ్రత అధికంగా ఉండటం వల్ల మానవతా దుఃఖరాగంతో ఆదివాసి మిత్ర సొసైటీ పేపర్ ఆధ్వర్యంలో ఉచితంగా వృద్ధులకు దుప్పట్లు పంపిణీ (blankets Distribution) చేయడం సంతోషకరమని అన్నారు ఇలాంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించి సొసైటీకి మంచి పేరు తెచ్చుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జూనియర్ శ్రీనివాస్, నిరుపేద వయోవృద్ధులు పాల్గొన్నారు.
