Asifabad Rural | అసిఫాబాద్ రూరల్, ఆంధ్రప్రభ : ఎల్లరం గ్రామ సర్పంచ్ గా బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ఎల్లవేళలా గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ఎల్లరం సర్పంచ్ అభ్యర్థి కాత్లే నీలబాయి అన్నారు. ఎల్లరం ఇప్పల్ నవేగంలో ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… తన భర్త కత్లే సీతరాం గత ఐదు సంవత్సరాలుగా ఎల్లరం సర్పంచ్ గా అభివృద్ధి పనులు చేశారని, భర్త స్పూర్తితో గ్రామంలో నెలకొన్న సమస్యలను ఎప్పటికపుడు పరిష్కరిస్తానని తెలిపారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు, ఫించన్లు ఇప్పిస్తామని తెలిపారు.
Asifabad Rural | గ్రామాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తా

