Asifabad | భారతి గ్రామర్ పాఠశాలకు అరుదైన అవార్డు
Asifabad | జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ భారతి గ్రామర్ పాఠశాలకు (School) అరుదైన అవార్డు దక్కింది. నాణ్యమైన విద్యా బోధనతో పాటు విద్యార్థుల సామర్థ్యం పెంపుదల తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్రస్థాయిలో ఈ అవార్డులు అందిస్తుండగా జైనూర్ మండల కేంద్రంలోని భారతి గ్రామర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఈ అవార్డుకు ఎంపికైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఇవాళ పాఠశాల కరెస్పాండంట్ పోలిపెల్లి నరేందర్ ఈ అవార్డు అందుకున్నారు
గత రెండు దశబ్దాలుగా విద్యాభివృద్ధికి పాటుపడుతుండగా ఈ ఏడాది వరుసగా రెండు అవార్డులు దక్కడం అనందంగా ఉందని పాఠశాల కరెస్పాండెంట్ పోలిపెల్లి నరేందర్ తెలిపారు. అవార్డు మరింత బాధ్యత పెంచిందన్నారు. హైదరాబాద్ (Hyderabad) లోని హైటెక్స్ సిటీలో జరిగిన ఈ అవార్డు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ట్రెస్మా రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి యాదగిరి యాదగిరి శేఖర్ రావు, పరంజ్యోతి, పెద్దపెల్లి కిషనరావు, దేవభూషణం, తదితరులు పాల్గొన్నారని కరస్పాండెంట్ పోలిపెల్లి నరేందర్ తెలిపారు.

