శ్రేయస్, జైష్వాల్‌పై అశ్విన్ సెటైర్

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆసియా కప్ (Asia Cup) 2025 కోసం మంగళవారం రోజు బీసీసీఐ 15 మంది ఆటగాళ్లు, 5 మంది స్టాండ్ బై ప్లేయర్ల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చేనెల 9 నుండి ప్రారంభం కానున్న ఈ టోర్నీకి శ్రేయస్ అయ్యర్, యశస్వి జైష్వాల్ (Shreyas Iyer, Yashaswi Jaishwal) లను ఎంపిక చేయలేదు. వీరిద్దరిని ఆసియా కప్ కోసం ఎందుకు ఎంపిక చేయలేదని బిసిసిఐ సెలక్షన్ కమిటీ ( BCCI Selection Committee) తో పాటు టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (India Head Coach Gautam Gambhir) పై విమర్శలు వస్తున్నాయి. స్టార్ బ్యాటర్లు, టి-20 స్పెషలిస్టులు ఐన శ్రేయస్ అయ్యర్, యశస్వి జైష్వాల్ ని ఆసియా కప్ జట్టు నుండి ఎందుకు తొలగించారని పలువురు సీనియర్ ప్లేయర్లు సైతం ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై టీమిండియా మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తన యూట్యూబ్ ఛానల్ “ఐష్ కి బాత్” లో తాజాగా అశ్విన్ మాట్లాడుతూ.. ” శ్రేయస్ అయ్యర్ కి అద్భుతమైన రికార్డు ఉంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించిన అతడు.. కనీసం జట్టులో కూడా లేడు. గిల్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడని వాదిస్తే.. శ్రేయస్ అయ్యర్ కూడా అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు కదా..! ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరు ఇస్తారు.శ్రేయస్ అయ్యర్, యశస్వి జైష్వాల్ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను. ఇది అన్యాయం. వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అందుకే ముంబైలో వరదలు వస్తున్నాయి.” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు రవిచంద్రన్ అశ్విన్. అలాగే కెప్టెన్ రోహిత్ కూడా జైష్వాల్‌ను ఎంపిక చేయకపోవడంపై స్పందించారు. నేనే కెప్టెన్ అయితే జైష్వాల్‌ను తప్పకుండా ఎంపిక చేస్తానని.. అతన్ని పక్కన పెట్టే చాన్సే లేదని, ఇది ఘోర తప్పిదమని రోహిత్ పేర్కొన్నాడు.
