జనసందోహం నడుమ ఆశీర్వాదం అంత్యక్రియలు..

జనసందోహం నడుమ ఆశీర్వాదం అంత్యక్రియలు..

ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన నిట్ట అబ్బి (51) అనారోగ్యంతో మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మృతికి గల కారణాలను తన భార్య జయమ్మ, కుమారులు ప్రవీణ్, నవీన్ తెలిపిన వివరాల ప్రకారం.. కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందులుపడుతూ.. అస్వస్థతకు గురి కావడంతో మెరుగైన చికిత్స కోసం కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. అయితే.. వైద్య చికిత్సలు అందిస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా అస్వస్థతకు గురై, ఆరోగ్యం విషమించి తుదిశ్వాసను విడిచారు. రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఎన్నో సత్సంబంధాలు ఏర్పరచుకొని, మండల ప్రజలకు వినమ్రుడిగా, వినయానికి దార్శినికుడిగా నిలిచిన నిట్ట ఆశీర్వాదం తుదిశ్వాస విడవడంతో మండలంలో ఒక్కసారిగా జనహృదయ మరణం జీర్ణించుకోలేకపోతున్నామని విచారం వ్యక్తం చేసారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండలోజు ముత్యమాచారి, ముక్తార్ హుస్సేన్ పాషా, గౌరబోయిన సుబ్బారావు, బుర్రవెంకన్న, వాసం శ్రీకాంత్, పడిగ సమ్మయ్య, సితారి కృష్ణ, చిరునోముల శ్రీనివాస్, మోకాళ్ళ శేఖర్ సర్పంచి, నుల్కతాటి శ్రీను, మహమ్మద్ అతాహర్, సుధాకర్, గోగ్గల కాంత్, రేసు ఎల్లయ్యతో పాటుగా కులపెద్దలు శేఖర్, స్వామిదాసు, ప్రసాద్, బాబు, ముకుందరావు తదితరులు విచారం వ్యక్తం చేశారు. మృతుడు నిట్ట ఆశీర్వాదం (అబ్బీ) ఎంతో సుపరిచితులని మండలంలో ప్రజలకు అందరివాడుగా ఆత్మీయులుగా పలు మధురమైన జ్ఞాపకాలను మిగిల్చిపోయారని తెలియచేశారు. మృతుడు.. భార్య జయమ్మ, కుమార్లు ప్రవీణ్, నవీన్, కుటుంబ సభ్యులను విడిచివెళ్లడం అందరి మనసులను కలిచివేసిందని అన్నారు. 20 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ వీరాభిమానిగా కార్యకర్తగా పార్టీకి ఎంతో సేవలు అందిస్తూ నాయకులకు విధేయతను చూపుతూ పార్టీ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొని అధికారుల మన్ననలు అందుకున్న అందరివాడుగా నిట్ట అబ్బి ఆశీర్వాదం మృతిచెందడం ఆళ్లపల్లి మండలానికి తీరని లోటని అన్నారు. గ్రామానికి సహృదయ మిత్రుడుగా కలిసి మెలిసి జీవించి ఒక్కసారిగా దూరమయ్యారని తెలవడంతో, ఏకత్వంలో భిన్నత్వంలా అన్నివర్గాల ప్రజలందరూ దానధర్మాలతో దహన సంస్కరణలకు సహాయం అందించి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.

మృతుడు నిట్ట అబ్బి అంతిమయాత్రలో ముస్లిం, బీసీ, ఎస్సీ, ఎస్టీ కులమతాలకతీతంగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ, ప్రజాసేవకులు మృతుడు గుండెచప్పుడు మూగబోయిందన్నారు. పేదవాడైనా పదొంతుల స్నేహభావం కోరుకునే మనస్తత్వం కలిగిన అబ్బి అంత్యక్రియలలో పాల్గొని పలువురు దిగ్భ్రాంతి విచారం వ్యక్తం చేశారు. ఎవరైనా అనివార్య కారణాలతో మృతి చెందిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో ఉంటే వారికి కొంత అల్పాహారాలు, ఆర్థిక సహాయ సహకారాలు అందించడంలో గౌరిశెట్టి శ్రీనివాసరావు ముందు వరుసలో ఉంటారు. అదే క్రమంలో మృతుడు నిట్ట అబ్బి అంతిమయాత్రకు స్థానిక కాంట్రాక్టర్ ముక్తార్ పాషా ఆధ్వర్యంలో నగదు, బియ్యంతో కలిపి 4,000 వేల రూపాయలను ఆర్థికంగా అందజేసి మానవత్వాన్ని చాటుకోవడం విశేషం.

Leave a Reply