Arrested | రాజ‌స్థాన్ లో పాక్ స్పై అరెస్ట్..

జైపూర్ – రాజస్థాన్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి పాకిస్థాన్ కోసం స్పై కార్యకలాపాలు నిర్వ‌హిస్తున్నాడ‌నే ఆరోప‌ణ‌ల‌పై నేడు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ స్టేట్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీస్‌లో పనిచేసే సకూర్‌ ఖాన్‌ మగళియార్‌ను సీఐడీ, ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను గత రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రికి పర్సనల్ సెక్రటరీగా ప‌నిచేశాడు. పాక్‌ సరిహద్దుల్లోని జైసల్మేర్‌ జిల్లా బరోడా గ్రామం ఇతడి స్వస్థలం. ఆ మాజీ మంత్రిది కూడా ఇదే గ్రామం.

కాగా, సకూర్‌ఖాన్‌ వ్యవహారాలపై అనుమానం వచ్చిన దర్యాప్తు సంస్థలు గత కొన్ని వారాలుగా నిఘా పెట్టాయి. ఖాన్‌ మొబైల్‌లో పలు పాకిస్థానీ ఫోన్ నంబర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పాక్‌ను దాదాపు ఏడుసార్లు సందర్శించినట్లు అతడు ఒప్పుకున్నాడు. ఇప్పటివరకు అతడి ఫోన్‌లో ఎటువంటి మిలిటరీ సమాచారం లేదని అధికారులు చెప్పారు. అయితే, అతను కొన్ని ఫైల్స్‌ను అతడు డిలీట్‌ చేసినట్లు గుర్తించారు. ఇక ఖాన్‌కు ఉన్న రెండు బ్యాంకు ఖాతాలను విశ్లేషిస్తున్నారు.

Leave a Reply