Arrest | టాలీవుడ్ ను నిండా ముంచిన పైర‌సీ కింగ్ కిర‌ణ్ అరెస్ట్ …

హైదరాబాద్‌: తెలుగు సినిమా (Tollywood ) పరిశ్రమలో సంచలనం సృష్టించిన భారీ సినిమా పైరసీ (piracy ) కేసులో ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన జన కిరణ్ కుమార్‌ను (kiran kumar ) సైబర్ క్రైమ్ పోలీసులు (cyber crime ) అరెస్టు చేశారు. కిరణ్ గత ఏడాదిన్నర కాలంలో 65 పెద్ద తెలుగు, తమిళ సినిమాలను పైరసీ చేసి, వాటిని ప‌లు వెబ్‌సైట్‌లకు అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పైరసీ కారణంగా సినిమా పరిశ్రమకు సుమారు రూ.3700 కోట్లు నష్టం వాటిల్లినట్లు ఫిల్మ్ ఛాంబ‌ర్ ఫిలిం ఛాంబర్ యాంటీపైరసీ సెల్ ప్రతినిధి మణీంద్రబాబు (manidra babu ) ఇప్ప‌టికే ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అత‌డి కోసం వేట ప్రారంభించిన పోలీసులు ఎట్ట‌కేల‌కు అరెస్ట్ చేశారు..

తెలుగు ఫిలించాంబర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత ఏడాది పైరసీ వల్ల ఇండస్ట్రీకి దాదాపు రూ.3,500 కోట్ల నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. 2019 నుంచే ఈ పని చేస్తూ వస్తున్న కిరణ్‌కు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. వందల మంది కష్టంతో కోట్లు పెట్టి నిర్మిస్తున్న సినిమాలను పైరసీ చేస్తోన్న ఇలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టాలీవుడ్ డిమాండ్ చేస్తోంది.

హైదరాబాద్‌లోని సినిమా థియేటర్లలో కిరణ్ కుమార్ కామ్‌కార్డ్ ద్వారా సినిమాలను రికార్డు చేసి, హెచ్ డి ప్రింట్ రూపంలో పైరసీ మాఫియా గ్రూపులకు అమ్ముతున్నాడు. ఒక్కో సినిమాకు 400 క్రిప్టో కరెన్సీ లేదా బిట్‌కాయిన్ల రూపంలో చెల్లింపులు తీసుకునేవాడు. ఈ డబ్బులను జూ పే వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా భారతీయ కరెన్సీగా మార్చుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఇటీవల విడుదలైన కన్నప్ప, పెళ్లికాని ప్రసాదు, గేమ్ చేంజర్, రాజధాని వంటి సినిమాల ఫైల్స్‌ను కిరణ్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 65 సినిమాలను ఇప్పటివరకు రికార్డు చేసినట్లు నిందితుడు వాంగ్మూలంలో పేర్కొన్నాడు. సినిమా థియేటర్లలోనే రికార్డింగ్ చేసి, వాటిని పైరసీ మాఫియాకు అమ్మడం ద్వారా భారీగా లాభాలు ఆర్జించాడు. ఈ అరెస్టుతో పైరసీ నెట్‌వర్క్‌పై మరింత లోతైన విచారణ జరుగుతోంది. సినిమా పరిశ్రమకు భారీ నష్టం కలిగించే ఈ రాకెట్‌ను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు.

Leave a Reply