Arrest | సామాజిక కార్య‌క‌ర్త మేధా పాట్క‌ర్ అరెస్ట్ …

న్యూఢిల్లీ: న‌ర్మ‌దా బ‌చావో ఆందోళ‌న్ నేత‌, సామాజిక కార్య‌క‌ర్త మేధా పాట్క‌ర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవ‌ల ఆమెపై నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ అయిన విష‌యం తెలిసిందే. 2000 సంవ‌త్స‌రంలో గుజ‌రాత్‌లోని ఓ ఎన్జీవో కు ఎల్‌జీ స‌క్సేనా అధినేత‌గా ఉన్న స‌మ‌యంలో మేధా పాట్కార్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. అత‌నో పిరికివాడు అని, హ‌వాలా కుంభకోణానికి పాల్ప‌డిన‌ట్లు మేధా పాట్క‌ర్ ఆరోపించారు. దీనిపై ఆయ‌న పాట్క‌ర్ పై ప‌రువున‌ష్టం కేసు దాఖ‌లు చేశారు.. ఇప్పుడు ఆ కేసులోనే మేధా పాట్క‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అంతకు మందు ఢిల్లీ కోర్టు ఆమె పై నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ చేసింది. కేసులో రెండు వారాల పాటు స్టే ఇవ్వాల‌ని పెట్టుకున్న పాట్క‌ర్ అభ్య‌ర్థ‌న‌ను కోర్టు కొ్ట్టివేసింది. దీంతో ఆమెను ఆరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *