Arrest | బాల్క సుమన్ అరెస్ట్, రిమాండ్

Arrest | బాల్క సుమన్ అరెస్ట్, రిమాండ్

Arrest | మంచిర్యాల, ఆంధ్రప్రభః మంచిర్యాల బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ను బుధవారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా నెలకొన్న ఘర్షణ నేపథ్యంలో రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ రాళ్ళ దాడిలో పోలీస్ కానిస్టేబుల్ రాకేష్ సహా కాంగ్రెస్ కార్యకర్త జావిద్ ఖాన్ తీవ్రంగా గాయపడిన ఘటనకు సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎస్సై గంగారం, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గోపతి రాజం ఇచ్చిన ఫిర్యాదులకు పరిగణనలోకి తీసుకున్న పోలీసులు బాల్క సుమన్ పై వేర్వేరుగా రెండు కేసులు నమోదు చేశారు. బుధవారం సాయంత్రం క్యాతన్ పల్లిలోని ఆయన స్వగృహములో అరెస్టు చేసి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్య పరీక్షలు అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Leave a Reply