KNL | సీఎం పర్యటన ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి కావాలి.. కలెక్టర్ రంజిత్ బాషా

కర్నూలు బ్యూరో : ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈనెల 17వ తేదీన ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం ప్రజా వేదిక, సి క్యాంప్ రైతు బజార్, స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర పార్క్ భూమి పూజ కార్యక్రమాలకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఏపీ సీఎం ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజా వేదిక వద్ద చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ – పిజిఆర్ఎస్ ) కి సంబంధించి ప్రజల నుండి అర్జీలు తీసుకునేందుకు గాను కౌంటర్ ఏర్పాటు చేయడంతో పాటు బ్యానర్ కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డ్వామా, డిఆర్డిఎ పిడి లను ఆదేశించారు.. స్టేజ్ ఏర్పాట్లు, స్టాల్స్ ఏర్పాట్లు, కాన్వాయ్, విఐపి పార్కింగ్ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలిస్తూ సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.. స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర పార్క్ ఏర్పాట్లను పరిశీలిస్తూ పరిసర ప్రాంతాల్లో కిందకి ఉన్న కరెంట్ తీగలను 20అడుగుల పైకి లేపాలని కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం సి క్యాంప్ రైతు బజార్ లో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలిస్తూ షాప్ లు అన్ని మునుపటిలాగే తెరిచి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, టిటిడి బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply