Arrangements | ముక్కోటి ఏకాదశికి పకడ్బందీ ఏర్పాట్లు

Arrangements | ముక్కోటి ఏకాదశికి పకడ్బందీ ఏర్పాట్లు
ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్
కదిరిలో అత్యవసర సమావేశం
Arrangements | శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఏర్పాట్లపై కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ అధ్యక్షతన శనివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ అధికారులు, అర్చకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి రోజున శ్రీవారి దర్శనానికి పలు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని, వారికి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. దర్శన క్యూల నిర్వహణ, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు.

