అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మున్సిపాలిటీలోని 4వ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం ‘ఆరోగ్య లక్ష్మి’ కమిటీ సమావేశం జరిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్ షబానా అజీమ్ విచ్చేసి ఆమె మాట్లాడుతూ ‘ఆరోగ్య లక్ష్మి’ పథకం కింద ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ, బాలింత అంగన్వాడీ కేంద్రానికి వచ్చి పోషక విలువలతో కూడిన భోజనాన్ని తీసుకోవాలని కోరారు.
3 నుండి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరి పేర్లను తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు చేయించాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎన్. సునీత, అంగన్వాడీ టీచర్ కె. మమత, ఆయా జహేదా, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
