పౌష్టిక పదార్థాలను సద్వినియోగం చేసుకోవాలి.

పౌష్టిక పదార్థాలను సద్వినియోగం చేసుకోవాలి.

చిట్యాల, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం గర్భవతు లు, బాలింతలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టిక ఆహార పదార్థాలను సద్వినియం చేసుకోవాలని, చిట్యాల పూర చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి అన్నారు. బుధవారం పుర పట్టణ పరిధిలో గల అంగన్వాడి కేంద్రం 2 లో ఆరోగ్య లక్ష్మి కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా గర్భవతులకు శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పూర వైస్ చైర్మన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల్లో బాలింతలు గర్భవతులు చిన్నారులు ఆరోగ్య లక్ష్మి భోజనాలు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వైద్యాధికారి ఈసం వెంకటేశం, సిహెచ్ఓ తోటకూరి నర్సింగరావు, హెచ్ ఎస్ తోటకూర వెంకటరమణ, ఫిమేల్ అసి స్టెంట్ బద్దుల స్వరాజ్యం, అంగన్వాడి దాడి అరుణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply