రోడ్ల దుస్థితిపై పోరాటానికి సిద్ధం

రోడ్ల దుస్థితిపై పోరాటానికి సిద్ధం

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : ప్రభుత్వాలు మారుతున్నాయి.. ప్రజాప్రతినిధులు మారుతున్నారు.. జిల్లాలో రోడ్ల పరిస్థితి మాత్రం మారడం లేదు. రోజురోజుకూ(Day by day) రోడ్లు అధ్వానంగా మారుతున్నాయి. ఎన్నికలకు ముందు రోడ్లను బాగు చేస్తామని చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి రావడం.. ఆ తరువాత రోడ్ల దుస్థితిని పట్టించుకోకపోవడం ప్రజాప్రతినిధులకు పరిపాటిగా మారింది! జిల్లాలోని దాదాపుగా అన్ని ప్రధాన మార్గాలు ప్రయాణానికి పనికిరాకుండా పోయాయి.

ప్రజాప్రతినిధులలో చలనం లేదు. చేవెళ్ల వద్ద నిన్న జరిగిన బస్సు దుర్ఘ‌ట‌న‌ అందరిని కలచివేసింది. అధ్వాన ర‌హ‌దారుల‌పై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల(public representatives)పై దుమ్మెత్తిపోస్తున్నారు. రోడ్లను బాగు చేసుకునేందుకు ప్రజా పోరాటానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ దిశగా ప్రజా సంఘాలు ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి.

హైదరాబాద్ – బీజాపూర్‌ రహదారిపై చేవెళ్ల వద్ద నిన్న జ‌రిగిన‌ ఆర్టీసీ బస్సు, కంకర టిప్పర్ ఢీ(gravel tipper truck)కొన్న ఘటనలో 19 మంది చనిపోవడం అందరి హృదయాలను కదిలించింది. ఈ హృదయవిదారక ఘటన ప్రతి ఒక్కరిని కలచివేసింది. కాలేజీలకు వెళుతున్న విద్యార్థులు ప్రమాదంలో చనిపోయారు.

విధులకు హాజరయ్యేందుకు వెళుతున్న ఉద్యోగులు మరణించారు. వివిధ పనుల నిమిత్తం వేకువజాము బస్సుకు హైదరాబాద్‌(Hyderabad) వెళ్లేందుకు సిద్ధ‌మైన ప్రజలు మృత్యువాత పడ్డారు. చేవెళ్ల బస్సు ప్రమాద ఘటన ఎన్నో కుటుంబాలలో శోకాన్ని నింపింది.

జిల్లాలో అన్ని ప్రధాన రోడ్డు మార్గాలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. ఒక్క రోడ్డు కూడా ప్రయాణం చేసేందుకు అనువుగా లేకపోవడం ప్రజలను, వాహనదారులను ఆగ్ర‌హానికి గురిచేస్తోంది. జిల్లా కేంద్రం వికారాబాద్‌లో ప్రధాన రోడ్లు అన్ని కూడా న‌ర‌కాన్ని తలపిస్తున్నాయి. వికారాబాద్‌ నుంచి తాండూరుకు వెళ్లే మార్గం ప్రజలు. వాహనదారుల సహనాన్ని పరీక్షిస్తోంది.

వికారాబాద్‌..పరిగి(Hyderabad, Vikarabad) రోడ్డు మార్గంలో ప్రయాణం చిర్రెత్తిస్తోంది. వికారాబాద్‌..హైదరాబాద్‌ రోడ్డు మార్గంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తోంది. ఇటీవల వికారాబాద్‌లో గుంతలమయంగా మారిన రోడ్డుపై కింద పడి ఒక రైల్వే కానిస్టేబుల్‌, ఒక న్యాయవాది మరణించారు. తాండూరు ప్రాంతంలో పాడైన రోడ్లు ప్రజలకు శాపంగా మారుతున్నాయి. ఈ రోడ్లు నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి.

చేవెళ్ల బస్సు ప్రమాద ఘటన జిల్లాలోని ప్రతి వ్యక్తిని కదిలించింది. ప్రజాసంఘాలు, సామాజిక కార్యకర్తలు రోడ్ల దుస్థితిపై సమాలోచనలు ప్రారంభించారు. రాజకీయాలకు అతీతంగా ప్రాంతాల వారిగా ప్రజా పోరాటం చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు కాకపోతే.. మరెప్పుడు కాదు అనే నినాదంతో ప్రజా ఉద్యమానికి సిద్ధ‌మవుతున్నారు.

ఈ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ప్రజలు, వ్యాపార, వాణిజ్య వర్గాలు ముందుకు వస్తున్నాయి. రోడ్లను బాగు చేయడంలో విఫలమవుతున్న ప్రజాప్రతినిధులు(public representatives)..అధికారుల తీరును ఎండగట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Leave a Reply