APSPDCL Office | అదే – మా లక్ష్యం..

APSPDCL Office | అదే – మా లక్ష్యం..
APSPDCL Office | అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : అనంతపురం శారద నగర్‌లో ఉన్న ఏపీఎస్పీడీసీఎల్ ఆఫీస్(APSPDCL Office) ప్రాంగణంలో వినియోగదారులు, రైతులకు విద్యుత్ ప్రమాదాలు – నివారణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ – రక్షక్ అను నూతన వాహనమును రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్(Minister Payyavula Keshav) ప్రారంభించారు.
ప్రజలలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి తెలిపారు. ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని వీటిని ఆయా విభాగాలకు సంబంధించిన అధికారులు జనంలోకి తీసుకెళ్లడం వల్ల సత్ఫలితాలు వస్తాయన్నారు. విద్యుత్ శాఖలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని దీని వల్ల అందరికీ మేలు జరుగుతుందన్నారు.
