APPSC | రంగంలోకి ఐజీ రవిశంకర్

APPSC | రంగంలోకి ఐజీ రవిశంకర్

APPSC | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిర్వహించిన 27/2018 నోటిఫికేషన్ నియామకాల్లో చోటు చేసుకున్న భారీ అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

27/2018 నోటిఫికేషన్‌ నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 11న హైకోర్టులో రిట్‌ అపీల్‌, అనుబంధ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈక్రమంలో ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సీఐడీ ఐజీ డాక్టర్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది.

సీఐడీ ఐజీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో మరో సభ్యుడిగా సీఐడీ ఎస్పీ కె. చక్రవర్తిని ప్రభుత్వం నియమించింది. నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలు, పేపర్ల మూల్యాంకనంలో జరిగినట్లు చెబుతున్న అక్రమాలపై ఈ బృందం లోతుగా దర్యాప్తు చేయనుంది.

Leave a Reply