వాజేడు సెప్టెంబర్ 5 ప్రభ న్యూస్: మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని పెనుగోలు కాలనీలో గత 15 సంవత్సరాలుగా విద్యుత్ సమస్యతో బాధపడుతున్న గిరిజనుల సమస్యను స్థానిక భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు దృష్టికి తీసుకు వెళ్లడంతో ఆ గ్రామంలో 25 పోలు విద్యుత్ వైర్లు అమర్చడానికి సుమారు రూ.4లక్షల నిధులు మంజూరు చేయించడం జరిగింది. మంజూరైన నిధులతో శుక్రవారం వాజేడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆ సమస్య పరిష్కారం కోసం పోళ్లను ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దంతులూరి విశ్వనాథ ప్రసాదరాజు నాగారం మాజీ సర్పంచ్ తల్లాడ ఆదినారాయణ సొసైటీ ఉపాధ్యక్షులు వత్సవాయి జగన్నాథరాజు కాంగ్రెస్ పార్టీ వాజేడు మండల మాజీ అధ్యక్షులు సీతారామరాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుముల సంజీవ యలం రామకృష్ణ విద్యుత్ శాఖ ఏఈ హర్షద్ అహ్మ ద్ సిబ్బంది పాల్గొన్నారు