AP | అసెంబ్లీలో ఆర్థిక కమిటీలకు చైర్మన్ల నియామకం..

ఏపీ శాసనమండలిలో ఆర్థిక కమిటీలను నియమిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. మూడు ఆర్థిక కమిటీలకు చైర్మన్లను నియమిస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నోటిఫికేషన్ జారీ చేశారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్లను అధికారికంగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది.

ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్‌గా పులవర్తి రామాంజనేయులు,
ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్‌గా కూన రవికుమార్‌
ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్‌గా వేగుళ్ల జోగేశ్వరరావు నియామకానికి ఆమోదం తెలిపినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

175 మంది శాసనసభ్యులకు 9 మందిని, 58 మంది శాసన మండలి సభ్యులలో ముగ్గురిని కమిటీల్లో నియమించారు.

Leave a Reply