తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి దర్శనం కోసం సిఫార్సు లేఖల వ్యవస్థను తిరిగి తీసుకువచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి సురేఖ.చంద్రబాబు నాయకత్వంలో తీసుకున్న ఈ మంచి నిర్ణయానికి తెలంగాణ ప్రజా ప్రతినిధులందరికీ ఉపయోగపడుతుందని, వారందరి తరపున తాను ఏపీ సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు వెల్లడిఅయితే, తెలంగాణ నుండి తిరుమలను సందర్శించే భక్తుల సంఖ్య ఈ మధ్య బాగా పెరిగిందని, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా, తెలుగు ప్రజల భక్తి… ముఖ్యంగా తెలంగాణ ప్రజల భక్తి తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిపై తగ్గలేదని మంత్రి నొక్కి చెప్పారు.
ఇటీవల ఏపీ సర్కారు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం, తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తిరుపతి దేవుడి దర్శనం కోసం సిఫార్సు లేఖలు ఇవ్వడానికి అనుమతించబడినందుకు తాము సంతోషంగా ఉన్నామని చెప్పారు.
అయితే, టీటీడీ అధికారులు గౌరవ ఏపీ ముఖ్యమంత్రి ఆదేశాలను సరిగ్గా పట్టించుకోవడం లేదని చంద్రబాబుకి నివేదించారు. దీంతో తెలంగాణ ప్రజాప్రతినిధులు, తిరుమల వేంకటేశ్వరుడి భక్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ అధికారులు తెలంగాణ భక్తులను అనుమతించకపోవడంపై తీవ్ర గందరగోళం నెలకొంటుందని చంద్రబాబు దృష్టికి సురేఖ తీసుకెళ్ళారు.ఈ విషయాన్ని వెంటనే ప్రత్యేకంగా పరిశీలించి, సదరు ఆదేశాలను సక్రమంగా పాటించేలా టిటిడి అధికారులకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
ఈ విషయంలో తమరి జోక్యం తెలంగాణకు చెందిన చాలా మంది భక్తులలో ఆనందాన్ని నింపుతుందని నివేదించారు..