AP N NGO | నూతన కార్యవర్గం ఎన్నిక..

AP N NGO | నూతన కార్యవర్గం ఎన్నిక..

APN NGO, చల్లపల్లి, ఆంధ్రప్రభ : ఏపీ ఎన్ ఎన్జీఓ అసోసియేషన్ చల్లపల్లి యూనిట్ నూతన అధ్యక్షునిగా చల్లపల్లి పంచాయతీ ఈఓ పేర్నివెంకట మాధవేంద్రరావు ఎన్నికయ్యారు. ఆదివారం చల్లపల్లి ఎంపీడీఓ కార్యాలయం హాలులో నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. నూతన అధ్యక్షునిగా మాధవేంద్రరావు, కార్యదర్శిగా సీహెచ్.వీ.డీ ప్రసాదరావు, అసోసియేట్ అధ్యక్షునిగా పీ. బ్రహ్మానందబాబు, ఉపాధ్యక్షులుగా జీవీ రమణ, ఎం.రాజకుమారి, వై.శాంసన్ బాబు, సంయుక్త కార్యదర్శులుగా జీ.రాంబాబు, ఏ.శ్రీనివాసరావు, అబ్దుల్ వాజీద్, వై.శివ నాగలక్ష్మి, కోశాధికారిగా కే.రామ కోటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

పర్యవేక్షణ..
చల్లపల్లి యూనిట్ వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ నాయకులు తోట సుధాకరరావు పర్యవేక్షణలో ఎన్నికల అధికారి బీ.రాజేంద్రకుమార్, సహాయ ఎన్నికల అధికారి శిర్విశెట్టి సురేష్ ఈ ఎన్నికలు నిర్వహించారు.

సత్కారం..
అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆకూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఏ.వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ ఏఓ సీతారామయ్య, పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ నూతన కార్యవర్గాన్ని ఘనంగా సత్కరించారు.

జిల్లా కౌన్సిల్ సభ్యులుగా..
అసోసియేషన్ జిల్లా కౌన్సిల్ సభ్యులుగా యార్లగడ్డ పంచాయతీ ఈఓ చెరుకూరి శ్రీనివాసరావు, వెలువోలు ద్రాక్షాయణి, వెంకటేశ్వర్లు, వీఆర్ఓలు ఓగిరాల నాగ మల్లేశ్వరరావు, తూము శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.

ఈసీ సభ్యులుగా..
చల్లపల్లి యూనిట్ ఈసీ సభ్యులుగా కళ్లేపల్లి రవి అంకినీడు, పూషడపు విష్ణు, వేమూరి లావణ్య, వై.నాగలక్ష్మి, ఎస్.నాగలక్ష్మి ఎన్నికయ్యారు.

Leave a Reply