apcm with farners : వెలిగొండలో.. సీఎం చక చక Andhra Prabha News

apcm with farners : వెలిగొండలో.. సీఎం చక చక Andhra Prabha News
- ఫీడర్ కాలువకు శంకుస్థాపన
- గంటవానిపల్లెలో పనుల పరిశీలన
- రైతులతో సీఎం ముఖాముఖీ
- భూగర్భ జలాల పెరుగుదలపై ఆశాభావం
- 11,580 క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువ నిర్మాణం
- రోజుకు 200 మీటర్ల లైనింగ్ పనులు
- 45 రోజుల్లో 45 టీఎంసీల నీటి డ్రాయింగ్ ప్రణాళిక
- నల్లమల సాగర్లో 53.83 టీఎంసీల నిల్వ సామర్థ్యం
- కంబం చెరువు అనుసంధానం –
- రూ.400 కోట్లతో అభివృద్ధి
- పోరుమామిళ్ల, రాచర్లకు నీటి సరఫరా లక్ష్యం
- వెలిగొండ టన్నెల్ పనుల పురోగతిపై ఏపీ సీఎం సమీక్ష
( ఆంధ్రప్రభ. మార్కాపురం బ్యూరో)

apcm with farners : వెలిగొండలో.. సీఎం చక చక Andhra Prabha Newscm with farners : దోర్నాలలోని గంటవానిపల్లె వద్ద వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ పనుల శంకుస్థాపన అనంతరం సీఎం చంద్రబాబు జరుగుతున్న పనుల్ని పరిశీలించారు. రైతులు వెంకటేశ్వరరెడ్డి, సురవరం గండి వీరారెడ్డితో మాట్లాడుతూ, ఫీడర్ కెనాల్ పనుల్ని పరిశీలించారు. కాలినడకనే .. కాలువ లైనింగ్ పనులను స్వయంగా పరిశీలించారు. రైతులు, అధికారులతో చక చక నడుస్తూ.. పనులను పరిశీలించారు. అలుపు సలుపు లేకుండా.. పీఎం ముందుకు సాగుతుంటే.. అధికారులు ఉరుకులు పరుగులు పెట్లారు.

వెలిగొండ పూర్తి అయితే ఈ ప్రాంత భూగర్భజలాలు కూడా పెరుగుతాయని, బోర్లకు, చెరువులకు నీరు వస్తాయని ముఖ్యమంత్రికి రైతులు వివరించారు. ప్రాజెక్టు పనులు, ఫీడర్ కాలువ పనులు వేగంగా చేపడుతున్న ముఖ్యమంత్రికి రైతులు ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రాంతానికి తాగు, సాగునీరు అందిస్తున్న ప్రభుత్వానికి అన్నదాతలు తమ ప్రాంతం తరపున ధన్యవాదాలు తెలిపారు. అరటి, బొప్పాయి లాంటి పంటల సాగు చేసేందుకు అనువైన ప్రాంతమని రైతులు వివరించారు.
apcm with farners : వెలిగొండలో.. సీఎం చక చక Andhra Prabha Newscm with farners : మీ వల్లే ప్రాజెక్టు వచ్చింది

మీరే శంకుస్థాపన చేశారు, మీరే ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుతో రైతులు అన్నారు. ప్రాజెక్టులో రూ.2500 కోట్ల విలువైన పనులు మిగిలి ఉన్నా వాటిని పూర్తి చేయకుండా జాతికి అంకింతం చేసినట్టు గత పాలకులు నాటకాలాడారని ముఖ్యమంత్రి అన్నారు. ఫీడర్ కాలువ లైనింగ్ పనుల్ని స్వయంగా పరిశీలించి, సీఎం చంద్రబాబు పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

11,580 క్యూసెక్కుల నీరు ప్రవహించేలా ఫీడర్ కాలువ పనులు చేపట్టామని జలవనరుల శాఖ అధికారులు వివరించారు. నల్లమల సాగర్ ప్రాంతంలో మూడు గ్యాప్స్ ఫిల్ చేసి రిజర్వాయర్ ఏర్పడిందని అధికారులు తెలిపారు. తద్వారా 53.83 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉందని సీఎంకు తెలిపారు.
apcm with farners : వెలిగొండలో.. సీఎం చక చక Andhra Prabha Newscm with farners : రోజుకు 200 మీటర్ల పని

రోజుకు 200 మీటర్ల మేర కాలువ లైనింగ్ పనులు చేస్తున్నామని , 1.80 లక్షల క్యూబిక్ మీటర్ల మేర సైడ్ వాల్ పనులు మే చివరి నాటికి పూర్తి చేస్తామని జలవనరుల శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఫ్లడ్ సీజన్ ప్రారంభం అయ్యే సమయానికి ఫీడర్ కాలువ సిద్ధం లవవుతుందని అధికారులు స్పష్టం చేశారు.

45 రోజుల్లో 45 టీఎంసీల మేర నీరు డ్రా చేసుకుని నల్లమల సాగర్ నింపేందుకు ప్రణాళిక చేసినట్టు వివరించారు. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్లు, కాలువ పనులు తదితర అంశాలను నమూనా ద్వారా ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. కంబం చెరువును కూడా నింపేలా కాలువను అనుసంధానించినట్టు తెలిపారు. స్థానికంగా వివిధ చెరువులు, నీటి వనరుల్ని నింపేందుకు అవసరమైన స్ట్రక్చర్లను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రూ. 400 కోట్లతో ఈ పనులు చేపట్టేందుకు వీలుగా కార్యాచరణ చేపట్టాలని సూచించారు.
apcm with farners : పోరుమామిళ్ల, రాచర్లకూ…

వెలిగొండ టన్నెళ్ల పనులు పూర్తి అయ్యాక, పోరుమామిళ్ల, రాచర్లకు కూడా నీరు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. నల్లమల సాగర్ ఫీడర్ కెనాల్ ను ఏరియల్ వ్యూ ద్వారా ముఖ్యమంత్రి తిలకించారు. వెలిగొండ టన్నెళ్ల పనులతో పాటు క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న వేర్వేరు ప్రాంతాల్లోని అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో సీఎం మాట్లాడారు.

మొదటి టన్నెల్ పనుల్లో ఇంకా 361 మీటర్ల బెంచింగ్ పనులు మిగిలి ఉన్నాయని , 2.8 కిలోమీటర్ల టన్నెల్ కాంక్రీట్ లైనింగ్ కూడా చేయాలని జల వనరుల శాఖ అధికారులు వివరించారు. 18.8 కిలోమీటర్ల పొడవైన రెండో సొరంగంలో ఇంకా 1.1 కిలోమీటర్ల మేర పనులు చేపట్టాలని అధికారులు వివరించగా , నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేయాలని జలవనరుల శాఖకు ముఖ్యమంత్రి సూచించారు. వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతి ఎప్పటికప్పుడు తనకు తెలియచేయాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
ALSO READ : PM Surya Ghar : ఊరూరా.. సూర్య ఘర్ Andhra Prabha SPL Story
