తెలంగాణ, ఆంధ్ర ప్రభ వెబ్ న్యూస్: ప్రస్తుతం పెళ్లిళ్లు ఫంక్షన్ బరాత్‌లో అయినా కచ్చితంగా డీజే ఉండాల్సిందే. కానీ ఆ డీజే శబ్దాల(DJ sounds)కు శృతిమించడంతో గుండెలు ఆగిపోతున్నాయి. ఊరేగింపులు(Processions), వివాహాలు(marriages), శుభకార్యాలు(Good deeds), ఇతర వేడుకలకు ఉపయోగించే DJ సౌండ్ సిస్టమ్ ఇప్పుడు ఆనందాన్ని దుఃఖంగా మారుస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల డీజే శబ్దాలకు వ్యక్తులు మృతి సంఘటనలు ఎక్కవయ్యాయి. వీటిలో వివాహాలు, ఊరేగింపుల సమయంలో బిగ్గరగా DJ ప్లే చేస్తుండగా గుండెపోటు, ఇతర కారణాలతో చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా ఉమ్మడి మహబూబ్‌నగర్(Mahabubnagar) జిల్లా ఇలాంటి ఘటననే పునరావృతమైంది.
నారాయణపేట(Narayanpet) జిల్లా కేంద్రంలో జరిగిన వినాయక నిమజ్జనంలో ఆపశృతి చోటుచేసుకుంది. వినాయకుడి నిమజ్జనం సందర్భంగా గణేష్ ఉత్సవ సమితి గణానాథుడి శోభాయాత్ర(Gananatha’s procession)లో భాగంగా డీజేను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శేఖర్(Shekhar) అనే వ్యక్తి డాన్స్ చేస్తుండగా.. ఒక్కసారిగా కిందపడి కుప్పకూలిపోయాడు. అది గమనించిన పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. అతనికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. కానీ గుండెపోటు(heart attack)తో శేఖర్ అక్కడిక్కడే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో నారాయణపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

