Apache AH 64 | భార‌త వైమానిక ద‌ళంలో అత్యాధునిక ఆపాచీ హెలికాప్ట‌ర్లు

అమెరికా నుంచి తొలి విడ‌త బ్యాచ్ భార‌త్ కు అంద‌జేత‌
ఆరు హెలికాప్ట‌ర్ల కోసం ఒప్పందం చేసుకున్న భార‌త్
ఈ ఏడాది చివ‌రిలో మ‌లి విడ‌త హెలికాప్ట‌ర్లు రాక

న్యూఢిల్లీ: భారత సైన్యం అమ్ములపొదిలోకి అమెరికాకు చెందిన అత్యాధునిక అపాచీ ఏహెచ్-64ఈ అటాక్ హెలికాప్టర్లు చేరాయి. తొలి విడ‌త‌గా మూడు హెలికాప్ట‌ర్లు అమెరికాలోని హిండ‌న్ విమానాశ్ర‌యంలో వాటిని భార‌త వైమానిక అధికారుల‌కు అప్ప‌గించారు.. వివిధ కార‌ణాల‌తో ఈ మూడు హెలికాప్ట‌ర్ల అప్ప‌గింత 15 నెల‌లు ఆల‌స్యం అయింది.

కాగా, ఆరు అపాచీ కొనుగోలుకు 2020లో అమెరికాతో భార‌త్ ఒప్పందం కుదిరింది. ఈ డీల్ విలువ 600 మిలియన్ డాలర్లు(రూ.5,171 కోట్లు). 2024 జూన్ నెలలో మొదటి దశ హెలికాప్టర్లను అప్పగించాల్సి ఉండగా, కొన్ని సాంకేతిక కారణాలతో జాప్యం జరిగింది. మొదటి దశ హెలికాప్టర్లు మంగళవారం అంద‌జేయ‌గా, రెండో దశ హెలికాప్టర్లు ఈ ఏడాది ఆఖరు నాటికి రాబోతున్నాయి. అపాచీ ఏ హెచ్-64ఈ హెలికాప్టర్లు భారత వైమానిక దళంలో కీలకం కాబోతున్నాయి. ఇవి శక్తివంతమైనవిగా పేరొందాయి. పాకిస్తాన్ సరిహద్దుల్లో వీటిని మోహరించబోతున్నారు. కాగా, 2015లో కుదిరిన మరో ఒప్పందం కింద భారత సైన్యం ఇప్పటికే 22 సాధార‌ణ‌ అపాచీ హెలికాప్టర్లను సమకూర్చుకుంది. తాజాగా అత్యాధునిక‌రించిన ఏహెచ్-64ఈ అటాక్ హెలికాప్టర్లు భార‌త వైమానిక ద‌ళంలో చేరాయి

Leave a Reply