AP | బిల్లుకు కాంగ్రెస్ మద్దతు

AP | బిల్లుకు కాంగ్రెస్ మద్దతు

AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.

ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ విభజన చట్టం–2014లో సవరణ చేయడానికి కేంద్రం ముందడుగు వేసింది. ఈ మేరకు సెక్షన్ 5(2)లో మార్పులు చేస్తూ రూపొందించిన బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

ఈ బిల్లు ప్రకారం 2024 జూన్ 2 నుంచి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అధికారికంగా ప్రకటించేలా చట్టబద్ధత కల్పించనున్నారు. లోక్‌సభలో ఆమోదం పొందిన తర్వాత ఈ బిల్లు రాజ్యసభకు పంపబడుతుంది. ఈ కీలక బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. దీంతో బిల్లు ఆమోదం పొందే అవకాశాలు మరింత బలపడినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Leave a Reply