AP | వైఎస్ జగన్ కు విజయసాయి రెడ్డి కౌంటర్
అమరావతి : ఏపీలో తాజాగా రాజ్యసభ ఎంపీ పదవిని పదవిని వదిలేసి, రాజకీయాలకే గుడ్ బై చెప్పేసిన వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఇంకా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. వైసీపీకి ఆయన గుడ్ బై చెప్పేయడంపై నిన్న పార్టీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ ఆయన్ను తిరిగి నిద్రలేపాయి. జగన్ కామెంట్స్ కు ఇవాళ ఆయన ఎక్స్ లో ఘాటు కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా తన క్యారెక్టర్ పై జగన్ చేసిన కామెంట్స్ కు సాయిరెడ్డి ఇచ్చిన రిప్లై చర్చనీయాంశమవుతోంది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. “నేను వ్యక్తిగత జీవితంలోనూ విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని. అందుకే ఎవరికీ, ఎలాంటి ప్రలోభాలకీ లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువులోనూ లేదు. అందుకే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, రాజకీయాలను వదులుకున్నా” అని పేర్కొన్నారు.