AP | వ‌ల్ల‌భ‌నేని వంశీ బెయిల్ పిటిష‌న్ కొట్టివేత …

విజ‌య‌వాడ – వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సెషన్స్ కోర్టు షాక్ ఇచ్చింది. వంశీ బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ కోరుతూ విజయవాడ 12 అదరపు డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టులో వంశీ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం నేడు డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ధర్మాసనం. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ ఏ71గా ఉన్నారు. ఇక సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోనూ వంశీ ముద్దాయిగా ఉన్నారు. ఈ కేసుల్లో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో ఆయ‌న బెయిల్ కోసం సెష‌న్ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.. ఇరువైపుల వాద‌నలు విన్న న్యాయ‌మూర్తి బెయిల్ పిటిష‌న్ ను తోసిపుచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *