AP | మ‌రికొద్దిసేప‌టిలో నామినేష‌న్ లు దాఖ‌లు చేయ‌నున్న కూట‌మి అభ్య‌ర్ధులు

వెల‌గ‌పూడి – ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ముగ్గురు అభ్యర్థుల‌తో పాటు బిజెపి అభ్య‌ర్ధి నేడు నామినేష‌న్ లు దాఖ‌లు చేయ‌నున్నారు.. నేటితో నామినేష‌న్ల ప్ర‌క్రియ ముగియ‌నుండ‌టంతో అంద‌రూ నామినేష‌న్ లు వేసేందుకు రెడీ అయ్యారు. కాగా ఎపిలో మొత్తం ఎమ్మెల్యే కోటాలో అయిదు ఎమ్మెల్సీ స్థానాల‌కు పోటీ జ‌రుగుతుండ‌టంతో కూట‌మి పార్టీలు సీట్లు స‌ర్దుబాటు చేసుకున్నాయి. టిడిపి మూడు స్థానాల‌లో పోటీ చేస్తుండ‌గా జ‌న‌సేన‌, బిజెపికి ఒక్కొ స్థానం కేటాయించారు.. ఇప్ప‌టికే జ‌న‌సే అభ్య‌ర్ధి నాగబాబ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఇక మిగిలిన నలుగురు నేడు నామినేష‌న్ లు వేయ‌నున్నారు .

ఇక బిజెపి అభ్యర్థిగా ఆ పార్టీ సీనియ‌ర్ నేత సోము వీర్రాజు ను ఎంపిక చేసింది.. ఇక టిడిపి అధినేత చంద్ర‌బాబు ఎమ్మెల్సీ ఎంపిక‌లో కొత్త పంధాను అనుస‌రించారు.. స‌మాజిక స‌మీక‌ర‌ణ‌లతో పాటు పార్టీ వీర విధేయుల‌కు ఈ సారి ఛాన్స్ ఇచ్చారు. దీనిలో భాగంగానే, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి యువ మహిళ కావలి గ్రీష్మకు అవకాశం దక్కింది. ఆమె ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా పోరాటాలు చేశారు అధిష్టానం దృష్టిని ఆకర్షించారు. టికెట్ రాకపోయినా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. దీంతో ఈసారి ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. బీద రవిచంద్ర కూడా ఇదే పరిస్థితి పార్టీకి అంటిపెట్టుకొని ఉండి టికెట్ విషయంలో కొంత ఇబ్బందులు ఎదురైనా సర్దుకుని పోయారు.. సర్దుకుని వెళ్లారు దీంతో ఎమ్మెల్సీ స్థానం ఆశించారు. ఆశించినట్టుగానే చంద్రబాబు న్యాయం చేశారు. బీటీ నాయుడు కూడా రెన్యువల్ కావాలని అడిగారు. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.. చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో కూడా ఉండి కుటుంబ సభ్యులకు.. పార్టీ నేతలకు ఎంతో నైతిక ధైర్యం ఇచ్చారు. అందుకే చంద్రబాబు తిరిగి రెన్యువల్ చేసినట్టు సమాచారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *