AP | మావోయిస్టు అగ్ర‌నేత‌ల లొంగుబాటు..

(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : 34 సంవ‌త్స‌రాలుగా మావోయిస్టు ఉద్య‌మంలో కీల‌కంగా ఉన్న క‌మ‌లేష్ (Kamlesh), అరుణ (Aruna) దంప‌తులు ఏపీ డీజీపీ హరీష్ గుప్తా (AP DGP Harish Gupta) సమక్షంలో లొంగిపోయారు. వీరు కృష్ణా జిల్లా (Krishna District) పోరంకి ప్రాంతానికి చెందిన వారు. కమలేష్ పై ఏపీలో రూ.20లక్షల రివార్డుతో పాటు అరుణపై రూ.5 లక్షల రివార్డు కూడా ఉంది.

ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాల నేపథ్యంలో ఉద్యమానికి స్వస్తి చెప్పి, జనజీవన స్రవంతిలో కలిసేందుకు వీరు ముందుకొచ్చారు. వీరితో పాటు మరో 13మంది మావోయిస్టులు (13 Maoists) కూడా డీజీపీ ముందు లొంగిపోయారు. వీరి వద్ద నుండి పోలీసులు (police) భారీ ఆయుధ డంప్ ను స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున ఆయుధ, మందు సామాగ్రితో పాటు కీలక సమాచార వ్యవస్థను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరికి తక్షణ సహాయంగా బీజేపీ హరీష్ గుప్తా సుమారు రూ.22 లక్షల నగదు చెక్కుల రూపంలో అందజేశారు.

నక్సల్స్ కు ఏపీ డీజీపీ హరీష్ గుప్తా అల్టిమేటం..
ప్రస్తుతం మావోయిస్టులకు ఆదరణ ఎక్కడా లేదని, తక్షణమే ఉద్యమంలో ఉన్న మావోయిస్టులందరూ లొంగిపోవాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ గుప్తా సూచించారు. అభివృద్ధి జరగాలంటే హింస ఏమాత్రం ఉండకూడదని, సమాజంలో హింసకు తావు లేదన్నారు. అవుట్ డేటెడ్ సిద్ధాంతాలతో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాలు చేయొద్దని హితవు పలికారు. ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారందరూ జనజీవన స్రవంతిలో కలవాలని, వారిపై ఉన్న రివార్డుతో పాటు ఇంటి స్థలం ఉపాధి అవకాశాలు తప్పకుండా కల్పిస్తామని డీజీపీ హామీ ఇచ్చారు.

Leave a Reply