AP | రాష్ట్రానికి 6 కుంకీ ఏనుగులు : 21న పవన్ ద్వారా అప్పగింత

తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో ( రాయలసీమ) : రాష్ట్రం లో పెరుగుతున్న అడవి ఏనుగుల దాడుల సమస్య పరిష్కారానికి ఈ నెల 21 న కర్ణాటక ప్రభుత్వం 6 కుంకీ ఏనుగులను ఇవ్వనున్నది. సరిహద్దు జిల్లాల్లో అడవి ఏనుగులు గ్రామాలపై విరుచుకు పడి ప్రజల ప్రాణాలకు, పంటలకు నష్టం కలిగిస్తున్న విషయం తెలిసిందే. దానిపై స్పందించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యణ్ గత ఏడాది ఆగష్టు లో కర్ణాటక ప్రభుత్వం తో మాట్లాడి అడవి ఏనుగులను అదుపు చేసి అడవుల వైపు మల్లించే శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను పంపాలని కోరిన విషయం కూడా విదితమే.

అందుకు సానుకూలంగా ప్రతిస్పందించిన కర్ణాటక ప్రభుత్వం ఈనెల 21న రాష్ట్రానికి 6 కుంకీ ఏనుగులు అందజేయడానికి ఏర్పాట్లు చేసింది. ఆ రోజు బెంగళూరులోని విధానసౌధ వద్ద కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి శివకుమార్ లు పవన్ కళ్యాణ్ సమక్షంలో కుంకీ ఏనుగులను అందచేయనున్నారు. కార్యక్రమం జరగనున్నది. తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా సరిహద్దు ల్లోని పంటపొలాలను నాశనం చేస్తున్న అడవి ఏనుగులను అదుపుచేసేందుకు ఈ కుంకీ ఏనుగులను వాడనున్నారు

Leave a Reply