AP | పెట్టుబడులకు సత్వా గ్రూప్ సుముఖత..

  • లోకేష్ బెంగళూరు పర్యటన స‌క్సెస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు మంత్రి నారా లోకేష్ చేపట్టిన బెంగళూరు పర్యటన మంచి ఫలితాన్నిచ్చింది. బెంగళూరులో ప్రముఖ రియాలిటీ సంస్థ సత్వా గ్రూప్ ప్రతినిధులతో మంత్రి లోకేష్ నిర్వహించిన చర్చలు విజయవంతమయ్యాయి.

ఈ సమావేశం జరిగిన కొన్ని గంటల్లోనే, సత్వా గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ ప్రకటన చేసింది. విశాఖపట్నంలో ‘వాంటేజ్ ప్రాజెక్టు’ పేరుతో గ్రేడ్-ఎ ఆఫీసులు, ప్రీమియం రెసిడెన్షియల్ యూనిట్లు, స్టార్ట్ అర్బన్ సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ తెలిపింది.

రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నిలిపేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి లోకేష్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Leave a Reply