AP | పొట్టేళ్ల పోటీలు అభినందనీయం..

AP | పొట్టేళ్ల పోటీలు అభినందనీయం..

AP, కూచిపూడి, ఆంధ్రప్రభ : సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా పొట్టేళ్ల పోటీలను నిర్వహించటం ఎంతైనా అభినందనీయమని రాష్ట్ర ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గత రెండు రోజుల నుంచి కూచిపూడిలో నిర్వహిస్తున్న పొట్టేళ్ల పందాల ముగింపోత్సవ కార్యక్రమంలో మంగళవారం రాత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతాంగం జరుపుకునే ముఖ్యమైన పండుగ సంక్రాంతి అని, ఈ వేడుకల్లో పొట్టేళ్ల పందాలు ఏర్పాటు చేసిన నన్నపనేని వీరేంధ్రకు అభినందనలు తెలిపారు. శతాబ్దాల కాలం నుంచి పొట్టేళ్ల పందాలు నిర్వహించటం సాంప్రదాయంగా వస్తుందన్నారు. కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన రైతులు ఈ వేడుకల్లో పాల్గొనటం మిక్కిలి సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ సందర్భంగా పొట్టేళ్ల పందాల్లో గెలుపొందిన వారికి షీల్డ్, నగదు బహుమతి అందించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ లింగమనేని రామలింగేశ్వరరావు. పందాల నిర్వాహకులు నన్నపనేని వీరేంద్ర, ఏఎంసీ చైర్మన్ దోనేపూడి శివరామయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply