AP| మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్ …

విజయవాడ : వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. మైనింగ్‌ కేసులో ముందస్తు బెయిల్‌ను ఇచ్చింది. కాగా, వల్లభనేని వంశీ మెడికల్ బెయిల్ పిటిషన్‌పై కూడా హైకోర్టు విచారణ జరిపింది.వంశీకి తక్షణమే వైద్యం అందించాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు లేవని.. వంశీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఏ ఆసుపత్రిలో వైద్యం అందిస్తారో వివరాలు తెలపాలని.. ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది.

Leave a Reply